అసాధారణ జనాభా మార్పులపై అధ్యయనం
కమిటీ ఏర్పాటు: కేంద్రమంత్రి అమిత్ షా
న్యూ ఢిల్లీ, మే 26: దేశ జనాభాలో చోటుచేసుకుంటున్న అసాధారణ మార్పులను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిం ది. రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవోలేకర్‌ను దీనికి చైర్‌పర్సన్‌గా నియమించింది. అక్రమ వలసలు, ఇతర అసాధారణ కారణాల వల్ల భారతదేశవ్యాప్తంగా జనాభాలో వస్తున్న మార్పులను ఈ కమిటీ అంచనా వేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ఎక్స్‌లో తెలిపారు.
ఇది మత, సామాజిక వర్గాల స్థాయిలో అసాధారణ మార్పుల సరళిని కూడా అధ్యయనం చేసి, పరిష్కారాలను ప్రతిపాదిస్తుందన్నారు. జనాభాలో వచ్చే అసాధారణ మార్పులు ఏ దేశా నికైనా వర్తమాన, భవిష్యత్తులకు ఒక పెద్ద సవాలుగా నిలుస్తాయని షా పేర్కొన్నారు. ఈ కమిటీలో సభ్యులుగా దేశ జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రా, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీ వాస్తవ, డాక్టర్ షమికా రవి ఉన్నారు.






