5 May, 2026 | 7:06 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యచరణను విజయవంతం చేయాలి

06-03-2026 03:00 PM

బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

బాన్సువాడ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించబడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మున్సిపల్ ఛైర్పర్సన్ విజయ కాసులవార్, వైస్ ఛైర్పర్సన్ రేష్మా బేగం, కౌన్సిలర్లు, ప్రజా ప్రజా ప్రతినిధులు మెప్మ అర్పిలతో కలిసి ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికను విజయవంతంగా అమలు చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్య నిర్వహణ మెరుగుదల, ప్లాస్టిక్ నిషేధం అమలు, చెత్త వర్గీకరణ, డ్రైనేజీ శుభ్రత, పచ్చదనం పెంపు వంటి కార్యక్రమాలను 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు 06-03-2026 నుండి 12-06-2026 వరకు కొనసాగనుందని తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రజల సహకారం ఎంతో అవసరమని, మున్సిపాలిటీ చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీహరి రాజు,మున్సిపల్ పాలకవర్గం సిబ్బంది ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.