1 April, 2026 | 1:33 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి షష్టి వేడుకలు

07-12-2024 05:00 PM

ప్రత్యేక పూజలు నిర్వహించిన అయ్యప్ప భక్తులు...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సుబ్రహ్మణ్య స్వామి షష్టి వేడుకలను అయ్యప్ప స్వాములు ఘనంగా నిర్వహించారు. శనివారం జిల్లా కేంద్రంలోని పెద్దవాగు సమీపంలో వెలసిన అయ్యప్ప స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం పురస్కరించుకొని ఆలయ అర్చకుడు నాగేశ్వర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు, అష్టోత్తరాలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు, స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.