విజయవంతమైన ఉచిత వైద్య శిబిరం
కల్వకుర్తి ఏప్రిల్ 26 : కల్వకుర్తి పట్టణంలోని మహిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైంది. ఆసుపత్రి కన్సల్టెంట్ వైద్యులు డాక్టర్ యశోద, డాక్టర్ శివరాం ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, పుర చైర్పర్సన్ బృంగి రత్నమాల, మున్సిపల్ వైస్ చైర్మన్ శాన్వాజ్ ఖాన్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని, సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో ఆసుపత్రి యాజమాన్యం చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు.






