27 April, 2026 | 2:18 AM

అర్హులైన జర్నలిస్టులలకు అక్రిటేషన్ కార్డుల జారీ

27-04-2026 12:35 AM

ఎమ్మెల్యే మేఘా రెడ్డి సహకారంతో జర్నలిస్టులకు న్యాయం టీయూడబ్ల్యూజే ( ఐజేయూ )జిల్లా అధ్యక్షులు మాధవ రావు

వనపర్తి టౌన్, ఏప్రిల్ 26: వనపర్తి ఎమ్మెల్యే తూడీ మేఘా రెడ్డి సహకారంతో వనపర్తి జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకు అక్రిటేషన్ కార్డుల విషయంలో న్యాయం జరుగుతుందని టి యు డబ్ల్యూ జె(ఐజెయు) జిల్లా అధ్యక్షులు. డీ. మాధవ రావు ఆదివారం పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు అక్రిటేషన్ కార్డులు వచ్చేలా చూడాలని యూనియన్ జిల్లా అధ్యక్షులు మాధవ రావు ఎమ్మెల్యే మేఘా రెడ్డి ని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఎ మ్మెల్యే అర్హులైన జర్నలిస్టులకు అక్రిటేషన్ కార్డులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.