16 April, 2026 | 3:54 AM

విజయవంతంగా అస్రా-2026

16-04-2026 02:25 AM

‘జాహ్నవి’ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహణ

ఉత్సాహంగా పాల్గొన్న కళాశాల విద్యార్థులు

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): జాహ్నవి డిగ్రీ, పీజీ కళాశాల, పీర్జాదిగూడలోని సంగం హోటల్‌లో అస్రా కార్యక్రమాన్ని బుధవా రం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ అతిథులుగా జాహ్నవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ ఏ.పరమేశ్వర్, వైస్ చైర్మన్ ఏ.లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ పరమేశ్వర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్య ద్వారా వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, సమాజానికి సేవ చేయాలనే భావనను పెంపొందించుకోవాలని సూచించారు.

విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని, కృషి, పట్టుదలతో ముందుకు సాగితే జీవితంలో విజయాలను సాధించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కు చైర్మన్, వైస్ చైర్మన్ చేతుల మీదుగాబహుమతులు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ జే.శిల్ప, అడ్మిన్ స్టాఫ్, అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.