14 July, 2026 | 2:40 PM

ది గర్ల్‌ఫ్రెండ్కథ అందర్నీ కదిలిస్తుంది

10-12-2024 12:00 AM

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో దీక్షిత్ శెట్టి  జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ను హీరో విజయ్ దేవరకొండ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ “ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌లోని ప్రతి విజువల్ ఆకట్టుకుంది. ఈ మూవీని చూసేందుకు వెయిట్ చేస్తున్నా. 8 ఏళ్ల క్రితం రష్మికను సెట్‌లో కలిశా. ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తున్న రష్మిక వ్యక్తిగతంగా ఇప్పటికే అంతే హంబుల్‌గా ఉంది. నటిగా ఆమెకు ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మరింత బాధ్యతను ఇచ్చింది. సక్సెస్ ఫుల్‌గా రష్మిక ఆ బాధ్యత వహిస్తుందని ఆశిస్తున్నా. ప్రతి ప్రేక్షకుడినీ కదిలించే మంచి కథను ఈ సినిమాతో డైరెక్టర్ రాహుల్ చూపిస్తాడని నమ్ముతున్నా” అన్నారు. వైవిధ్యమైన ప్రేమకథతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్; సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్.