12 March, 2026 | 11:02 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

నవోదయ పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్

06-02-2026 12:07 PM

సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 6 : ఈ నెల 7న జరిగే జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ తెలిపారు. ప్రజ్ఞాపూర్ లోని సెయింట్ మేరీ విద్యానికేతన్, బాలుర జడ్పీహెచ్ఎస్, గజ్వేల్ లోని ఆర్అండ్ఆర్ కాలనీ జడ్పీహెచ్ఎస్, జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హబ్, తెలంగాణ మోడల్ స్కూల్, ప్రభుత్వ హైస్కూల్, సెయింట్ జోసెఫ్ గర్ల్స్ హైస్కూల్, వర్గల్ లోని జవహర్ నవోదయ విద్యాలయం పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 163 సెక్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎగ్జామ్ సెంటర్ నుంచి 500 మీటర్లు పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది  గుమిగూడ వద్దని  సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టం ప్రకారం శిక్షార్హులుగా పరిగణించబడతారని సీపీ హెచ్చరించారు.