11 July, 2026 | 8:34 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

సుహాస్ ‘జనక అయితే గనక’

03-07-2024 12:05 AM

మా సినిమాలో ఆనందం.. పట్టలేనంత, బాధలు.. చెప్పుకోలేనంత, నవ్వులు.. ఆపుకోలేనంత ఉంటాయంటున్నారు  కథానాయకుడు సుహాస్. వరుస విజయాలతో హీరోగా దూసుకుపోతున్న సుహాస్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థలో  ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సందీప్ బండ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను మంగళవారం ప్రకటించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై నాల్గవ చిత్రంగా హర్షిత్, హన్షిత రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘జనక అయితే గనక’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

ఈ మేరకు ఓ పోస్టర్‌ని విడుదల చేయగా, అందులో న్యాయదేవత బొమ్మతో పాటు చిన్నపిల్లలకు సంబంధించిన కొన్ని వస్తువులు ఉన్నాయి. వీటిని బట్టి కథ ఏమై ఉండవచ్చో ఆలోచించుకోమంటూ ప్రేక్షకుల బుర్రలకు పదును పెట్టారు చిత్ర రూపకర్తలు. సినిమాటోగ్రాఫర్‌గా సాయి శ్రీరామ్, సంగీత దర్శకుడిగా విజయ్ బుల్గానిన్ పనిచేస్తున్న ఈ సినిమాలో సంగీర్తన విపిన్ కథానాయికగా నటిస్తుంది. కుటుంబ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ జూలై 4న విడుదల కానుంది.