కోల్‌కతా నన్ను ఆదరించింది
19 ఏళ్ల తర్వాత ఈ నగరానికి వచ్చా
నా పాత జీవితం తిరిగొచ్చినట్లుంది
రచయిత్రి తస్లీమా నస్రీన్
కోల్‌కతా, ఆగస్టు 2: .‘ఎన్నో ఏళ్ల తరువాత కోత్‌కతాను చూస్తున్నా. ఈ నగరాన్ని చూస్తుంటే నా పాత జీవితం మళ్లీ తిరిగొచ్చినట్లుగా ఉంది. కోల్‌కతా నన్ను ఎంతగానో ఆదరించింది’ అంటూ ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ భావోద్వేగానికి గురయ్యారు.
తన రచనలపై తీవ్ర వ్యతిరేకత, బెదిరింపుల నేపథ్యంలో కోల్‌కతాను వీడిన తస్లీమా నస్రీన్.. 19 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి నగరంలో అడుగుపెట్టారు. ఆదివారం కోల్‌కతాలో ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడేందుకు ఇక్కడికి రాలేదని, మహిళల సమాన హక్కులు, మానవ హక్కులు, లౌకికవాదం, హేతుబద్ధమైన ఆలోచనలు, భావప్రకటనా స్వేచ్ఛ కోసం తన గొంతుకను వినిపించేందుకు వచ్చానన్నారు.
తన రచనల కారణంగా తీవ్రవాదుల నుంచి బెదిరింపులు రావడంతో 1994 ఆగస్టు 8న బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టాల్సి వచ్చిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత ఏ నేరం చేయకపో యినా 2007 కోల్‌కతాను కూడా వదలి వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యం.. నన్ను నా దేశం నుంచి బయటకు పంపిందేమో గానీ, తనలోని దేశభక్తిని, బెం గాలీ భాష పట్ల ఉన్న ప్రేమను దూరం చేయలేకపోయిందని తస్లీమా వ్యాఖ్యానించారు. బెంగాలీ భాషే తన కంటికి కనిపించే మాతృభూమి అని వర్ణించారు.
స్వే చ్ఛగా ఆలోచిం చే రచయితలను, మేధావులను దేశం నుంచి వెలేస్తే శాంతి నెలకొనదని, అలాంటి చర్యలు కేవలం తీవ్రవాద శక్తులకు బలం చేకూరుస్తాయన్నారు. ప్రజాస్వామ్య బలం అనేది విభే దించే గొంతుకలకు ఎంత రక్షణ లభిస్తుందనే దానిపైనే ఆధారపడి ఉంటుందన్నారు. మహిళల హక్కులు, మూఢనమ్మకాలు, మత ఛాందసవాదంపై తన పోరాటం కొనసాగుతుందని నస్రీన్ స్పష్టం చేశారు. కోత్ కతాకు వచ్చిన తనకు భద్రత కల్పించిన సీఎంకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.






