calender_icon.png 21 May, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారం పొయిందని ఆత్మహత్య

21-05-2025 12:23:59 AM

  1. మనస్థాపంతో కుమారుడితో కలిసి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం 

చికిత్స పొందుతూ మహిళ మృతి

ఎల్బీనగర్, మే 20 : వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలకుంటలోని ఆగమయ్య కాలనీలో ఉంటున్న గోపిక గీతారాణి, సత్యనారాయణ దంపతుల కుమార్తె సుధేష్ణ(28)ని అమ్మదయ కాలనీలో ఉం టున్న నోముల ఆశిష్ కుమార్ తో వివా హం జరిగింది. వీరికి నాలుగేండ్ల కుమారు డు ఉన్నాడు. కాగా, సుధేష్ణ ఈ నెల 16న నా చారంలోని స్వాగత్ ఫంక్షన్ హాల్ జరిగిన బంధువుల శుభకార్యానికి వెళ్లింది.

అక్కడ సుధేష్ణకు చెందిన 7 తులాల బంగారు గొలుసు చోరీకి గురయింది. దీంతో మనస్తాపానికి గురైన సుధేష్ణ మంగళవారం తెల్ల వారుజామున వారు నివసిస్తున్న భవనంలోని మూడో అంతస్తు నుంచి బాబుని తీసు కొని కిందకు దూకింది.

ఈ ప్రమాదంలో సుధేష్ణ తీవ్రంగా గాయపడడంతో దగ్గర్లో ఉన్న కామినేని హాస్పిటల్ తీసుకోవెళ్ళగా, అక్కడ చికిత్స పొందుతూ సాయం త్రం మృతి చెందింది. బాబు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు వనస్థలిపురం పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.