21-05-2025 12:22:50 AM
- నాబార్డ్, ఆర్‌ఐడీఎఫ్ నిధులతో నిర్మించాలి
- సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): నాబార్డ్, ఆర్‌ఐడీఎఫ్ నిధులతో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోదాములు, కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉన్న గోదాములు, కోల్డ్ స్టోరేజీల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మార్కెటింగ్, ఆయిల్‌ఫెడ్, వ్యవసాయశాఖ అధికారుతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. రైతులు మాత్రమే తమ ఉత్పత్తులను అమ్ముకునేలా రైతు బజార్లను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకోసం అన్ని మార్కెట్లలో, రైతు బజార్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మార్కెట్లలో డిజిటల్ బోర్డుల ఏర్పాటుపై ఆరా తీశారు.
మార్కెట్ యార్డుల పునర్విభజనకు ప్రజాప్రతినిధుల ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని ఏర్పాటు చే యాలన్నారు. ఇప్పటికే 40 లక్షల పత్తి విత్తనాల ప్యాకేట్లను జిల్లాలవారీగా సిద్ధం చేశామని, వచ్చే పది, పదిహేను రోజుల్లో 2 కోట్ల విత్తన ప్యాకేట్లను అందుబాటులో ఉంచుతామని వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు.
ఈ నెలాఖ రు వరకు 2 లక్షల మట్టి నమునాల సేకరణ పూర్తిచేసి, వాటి ఫలితాలు రెండు నెలల్లోపు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపి, ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్‌బాషా, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మిబాయి పాల్గొన్నారు.