calender_icon.png 21 May, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐబీడీకి ‘ఆస్టర్ ప్రైమ్’లో సమగ్ర చికిత్స

21-05-2025 12:24:43 AM

-డాక్టర్ కలువల హర్ష 

హైదరాబాద్, మే 20 (విజాయక్రాంతి): ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (ఐబీడీ)కి ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో సమగ్ర చికిత్స అందిస్తున్నట్టు కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కలువల హర్ష చెప్పారు. ఐబీడీ దీర్ఘకాల వ్యాధి కావడంతో ఇది జీవనశైలినే మార్చేస్తుందన్నారు. దీనికి వెంటనే చికిత్స అవసరమని చెప్పారు.

మన దేశంలో 15 లక్షల మంది ఈ వ్యాధి బాధితులున్నారని పేర్కొన్నారు. ఈ నెల 19న ప్రపంచ ఐబీడీ దినోత్సవం సందర్భంగా దీనిపై అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఐబీడీ చికిత్స కోసం ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఒక ప్రముఖ కేంద్రాన్ని ఏర్పాటుచేసిందని పేర్కొన్నారు. అందులో మెడికల్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు, ఐబీడీకి శిక్షణ పొందిన వైద్యులు, నర్సులు, డైటీషియన్లు, సైకాలజిస్టులు ఉన్నారు.

దీనికి ప్రత్యేకంగా కేటాయించిన 20 పడకలు, అత్యాధునిక సదుపాయాలతో అనేకమంది రోగులకు ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి అత్యాధునిక చికిత్సలు అందిస్తోందని చెప్పారు. పలు జిల్లాల నుంచి వైద్యులు రోగులను ఇక్కడకు పంపుతున్నారు. ముఖ్యంగా ఈఎంఆర్ ఆధారిత ఫాలోఅప్ కార్యక్రమం ఉండటం, అందరికీ వ్యక్తిగత సంరక్షణ కోసం వారానికోసారి ఐబీడీ క్లినిక్ ఏర్పాటుచేయడం ఇక్క డి ప్రత్యేకతలు అని చెప్పారు.