11 May, 2026 | 8:40 PM

Breaking News

ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ కనబర్చిన శివానికి సీఎం చేతుల మీదుగా ల్యాప్‌టాప్ ప్రదానం   •   కాసిపేట గనిని సందర్శించిన జీఎం రాధాకృష్ణ   •   ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి: ఆర్డిఓ సుబ్రహ్మణ్యం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – సేంద్రియ సాగుతోనే భవిష్యత్‌   •   అంబార్‌పేట్‌లో ఘనంగా శివగంగల కళ్యాణం   •   రేగులగుంటలో ఘనంగా నాభిశిల ప్రతిష్ట   •   ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి   •   ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలి   •   గ్రామ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ లో చేరిన వార్డ్ సభ్యులు   •  

ఎంఈఓ చేతుల మీదుగా సమ్మర్ క్యాంప్ ప్రారంభం

11-05-2026 08:08 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని పి ఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీ.హెచ్.ఎస్)లో సోమవారం సమ్మర్ క్యాంప్ శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) ప్రారంభించారు. వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

క్యాంప్‌లో భాగంగా విద్యార్థులకు ఆటలు, పాటలు, యోగా, చిత్రలేఖనం, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విద్యా నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ అందించను న్నారు.విద్యార్థుల్లో సృజనా త్మకత, ఆత్మవిశ్వాసం పెంపొం దించేందుకు ఇలాంటి కార్యక్ర మాలు దోహదపడతాయని ఎంఈఓ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నటరాజ్ మాట్లాడుతూ... విద్యార్థులు సెలవులను సద్వినియోగం చేసుకొని కొత్త విషయాలు నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.