11 July, 2026 | 1:51 AM

ద్విభాషా చిత్రంగా సూపర్ హీరో బాబు

11-07-2026 12:00 AM

అర్జున్ దాస్, శాండీ మాస్టర్ ప్రధాన పాత్రల్లో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతోంది. తమిళంలో ‘సూపర్ హీరో’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘సూపర్ హీరో బాబు’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సోల్జర్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌కు చెందిన ప్రముఖ నిర్మాత కేఎస్ సినిష్ సమర్పకుడిగా వ్యవహరిస్తూ, రెడ్ ఆక్టెడ్ స్టూడియోస్ బ్యానర్‌కు చెందిన శంజన్ జీతో కలిసి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంతో విఘ్నేశ్ వేణుగోపాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవల ‘ఓజీ’తో తెలుగు నాట మంచి పేరు సంపాదించు కున్న అర్జున్ దాస్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. అర్జున్ దాస్, హీరోయిన్ తేజు అశ్విని మధ్య సీన్స్ ఈ మూవీకి హైలెట్ కానున్నాయి. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటంతో ఈ తాజా ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రబృందం పంచుకున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.