ఘనంగా సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు
మణుగూరు (విజయక్రాంతి): సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) 50వ జన్మదిన వేడుకలను మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ విద్యాభ్యాస పాఠశాల విద్యార్థులతో సహా పంక్తి భోజనాలు, ప్రభుత్వ వందపడకల ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి, బ్లడ్ బ్యాంక్ కు రక్తం దానం చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమాన కథా నాయకుని పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్, రెడిమేడ్ అధినేత వెంకట నాగేశ్వరావు, బాలాజీ స్వీట్ అధినేత రంగారావు, ముఖ్య అతిధులు గా విచ్చేసి కేక్ కట్ చేసి అభిమానులకు శుభా కాంక్షలు తెలిపారు. మహేష్ బాబు ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు గోపి, శ్రీనివాసరా వు ,జానపాటి వేణు,ఎస్ వి నాయుడు, ప్రదీప్ ,సర్వేష్ , కాజా, వినయ్, సురేష్, ఆదిత్య, వెంకటేష్, వర్షిత్ పాల్గొన్నారు.






