calender_icon.png 9 August, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం

09-08-2025 07:16:57 PM

పటాన్ చెరు/జిన్నారం: మండల కేంద్రం జిన్నారంలోని గిరిజన గురుకుల పాఠశాల(Tribal Gurukul School)లో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు రంగోలి, చిత్రలేఖనం, వ్యాసరచన, ఉపన్యాస, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ సీహెచ్ వెంకటయ్య ఆదివాసి దినోత్సవ ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ వి శ్రీనివాస్, డిప్యూటీ వార్డెన్ కమలాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.