calender_icon.png 9 August, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ కు ఖాకీ బాస్ కరువు

09-08-2025 07:05:42 PM

బిజెపి పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్

హుజూర్ నగర్: రాష్ట్ర మంత్రి కెప్టెన్ ఉత్తమ్ ఇలాకలో హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ కు స్టేషన్ హౌస్ ఆఫీసర్ లేక లా అండ్ ఆర్డర్ సమస్యలతో పాటు చాలా కేసులు పెండింగ్ లో ఉండి చాలామంది సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బిజెపి పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్(BJP Town President Konda Harish Goud) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో యస్ఐ లేకపోవడం వలన పట్టణంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు పెరిగిపోతున్నాయని రానున్న రోజులలో గ్రామదేవతల జాతరలైన గంగమ్మ తల్లి జాతర, పట్టణంలో అత్యంత వైభవంగా రెండు రోజులపాటు జరిగేటువంటి ముత్యాలమ్మ తల్లి జాతరలు,గణేశ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే హుజూర్ నగర్ ఎస్ఐని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.