10 July, 2026 | 10:03 PM

నరసింహారావు కుటుంబానికి న్యాయం జరిగింది

10-07-2026 09:17 PM

- ఐటిసిపిఎస్పిడి కర్మాగారంలో కాంటాక్ట్ కార్మికులు సంపూర్ణంగా మద్దతు

- సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని సారపాక ఐటిసి పిఎస్పీడీ కర్మాగారంలో పని చేస్తున్న వరికూటి నరసింహారావు మధ్యాహ్నం భోజనం టైం లో ఛాతి నొప్పి వస్తుందని డ్యూటీ నుంచి బయటికి వచ్చి హాస్పిటల్లో చూపించుకున్నాడు కానీ ఫలితం లేదని నరసింహారావు మృతి చెందాడని సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. నరసింహారావు కుటుంబానికి న్యాయం జరగాలని సిపిఎం పార్టీ, సిఐటియు యూనియన్లు అధికారంలో ఉన్న యూనియన్ వారు, ప్రతిపక్ష యూనియన్ వారు అందరూ కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేయటం జరిగిందని పేర్కొన్నారు.

ముఖ్యంగా కుటుంబానికి అండగా నిలిచిన కాంట్రాక్ట్ కార్మికులు ఏ షిఫ్ట్, జనరల్ డ్యూటీ, బి షిఫ్ట్, మూడు సీట్లు ఆగిపోయాయని వారి యొక్క పోరాట ఫలితంగా వారు ఇచ్చిన ధైర్యం మేనేజ్మెంట్ తప్పనిసరిగా అంగీకరించారని తెలియజేశారు. ఆ కుటుంబానికి ఇద్దరు ఆడపిల్లలకు ఇంటర్మీడియట్ పూర్తిగా చదివించే బాధ్యత మేనేజ్మెంట్ 15 లక్షలు ఇచ్చేటట్లు అంగీకరించాలని, అదేవిధంగా నరసింహారావు భార్యకు స్కూల్లో ఆయా పోస్ట్ ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఆ కుటుంబానికి కాంట్రాక్ట్ కార్మికుల అండదండలతో మేనేజ్మెంట్ ముందు రావలసిన అవసరం వచ్చిందని వారికి సిపిఎం పార్టీ తరఫున ఆయన అభినందనలు తెలిపారు.