పుట్టినరోజున విద్యార్థులకు తోడ్పాటు
- బీజేపీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షులు అనంతరెడ్డి
చేవెళ్ళ జులై 15(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షులు అనంతరెడ్డి జన్మదిన సందర్భంగా బీజెవైఎం జిల్లా కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల ము న్సిపల్ పరిధిలోని మ ల్కాపూర్ వార్డులోని ప్రైమర్ స్కూల్లో విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేసేరు. సాయం కాలం ధర్మసాగర్ రెవెన్యూలోని బంగారు మైసమ్మ ఆలయం వద్ద పుట్టినరోజు వేడుక లు పార్టీ కార్యకర్తలు నేతలు అభిమానుల స మక్షంలో ఘనంగా నిర్వహించారు.
అనంతరం మున్సిపల్ అధ్యక్షుడు అత్తేలి అనంత రెడ్డి మాట్లాడుతూ... తమ పుట్టినరోజు పేద విద్యార్థుల విద్యకు తోచిన సహాయం అం దించడం సంతోషాన్నిచ్చిందన్నారు. మునుముందు ప్రజా ఉపయోగకరమైన కార్యక్ర మాలు చేసేందుకు సిద్ధమన్నారు. తమపై అభిమానంతో వచ్చిన వారికి కృతజ్ఞతలు తె లిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, యువకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.






