15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మంథనిలో కాంగ్రెస్‌ పార్టీకి పెరుగుతున్న మద్దతు

08-02-2026 01:46 PM

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మంథని పట్టణ ప్రజల్లో రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీకి క్యూ కడుతున్నారు. ఆదివారం మంథని పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 2వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోగుల రవి తో పాటు ఎడ్ల సాగర్, బుక్క సాయి  తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 వారికి టీపీసీసీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ మంథన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతు తో 13 వార్డులకు 13 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని అన్నారు. ఉదయం నుండి శ్రీను బాబు అన్ని వార్డులలో విసృతంగా ప్రచారం చేస్తున్నారు.