calender_icon.png 10 November, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రాకు మద్దతివ్వాలి

27-08-2024 12:50:20 AM

ముషీరాబాద్, ఆగస్టు 26: జంట నగరాల్లో జలాశయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హైడ్రాకు ప్రజలు మద్ద తు ఇవ్వాలని టీపీసీసీ రాష్ట్ర కార్మిక విభాగం కార్యదర్శి రవీంద్రనాథ్ నాయుడు కోరారు. సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హైడ్రా చేపడుతున్న అక్రమ కూల్చివేతలను అడ్డుకునేందుకు మాజీ మం త్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రయత్నించడం విడ్డూరంగా ఉన్నదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చెరువులు క బ్జాకు గురయ్యాయని ఆరోపించారు