9 August, 2026 | 10:46 PM

ఖరీఫ్ లో 14 రకాల పంటలకు మద్ధతు ధర.. పంటలివే

19-06-2024 09:22 PM

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబుర్ ను అందించింది. వరితో పాటు ఖరీఫ్ లో 14 రకాల పంటలకు మద్ధతు ధరలను పెంచితూ కేంద్రమంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. వరి మద్దతు ధర రూ. 117 పెంచింది. దీంతో వరి ధాన్యం క్వింటాల్ కు ధర రూ.2,300కి చేరింది. అలాగే రాగి,  జోన్న, సజ్జలు, మినుములు, రాగి, పత్తితో సహా మొత్తం 14 ఖరీఫ్ సీజన్ పంటలపై మద్దతు ధరను పెంచేందుకు ప్రధాని మోదీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

ధరలు పెరిగిన పంటలివే

వరి ధాన్యం క్వింటాల్ కు మద్దతు ధర రూ. 117 పెరిగి, రూ.2,300కి చేరింది 

జోన్న క్వింటాల్ కు మద్దతు ధర రూ. రూ.191 పెరిగి, రూ.3,371కి చేరింది

మొక్క జోన్న క్వింటాల్ కు మద్దతు ధర రూ.135 పెరిగి, రూ.2,225కి చేరింది

సజ్జలు క్వింటాల్ కు మద్దతు ధర రూ.125 పెరిగి, రూ. 2,625కి చేరింది

రాగి క్వింటాల్ కు మద్దతు ధర రూ. 444 పెరిగి, రూ. 4,290కి చేరింది

కంది  క్వింటాల్ కు మద్దతు ధర రూ. 550 పెరిగి, రూ. 7,550కి చేరింది

పెసర్లు క్వింటాల్ కు మద్దతు ధర రూ. 124 పెరిగి, రూ. 8,682కి చేరింది

మినుములు క్వింటాల్ కు మద్దతు ధర రూ.450 పెరిగి, రూ. 7,400

వేరు శనగ క్వింటాల్ కు మద్దతు ధర రూ. 406 పెరిగి, రూ. 6,783

సన్ ఫ్లవర్ క్వింటాల్ కు మద్దతు ధర రూ. 520 పెరిగి, రూ. 7,280

సోయా క్వింటాల్ కు మద్దతు ధర రూ. 292 పెరిగి, రూ. 4,892

నువ్వులు క్వింటాల్ కు మద్దతు ధర రూ. 632 పెరిగి, రూ. 9,267

ఒడిసలు క్వింటాల్ కు మద్దతు ధర రూ. 983 పెరిగి, రూ. 8,717

పత్తి క్వింటాల్ కు మద్దతు ధర రూ. 501 పెరిగి, రూ. 7,121