9 August, 2026 | 9:38 PM

సైబర్ నేరగాళ్లకు సహకారిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్టు

19-06-2024 09:47 PM

హైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు సహకారిస్తున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ సైబర్ సెక్యురిటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్లకు సిమ్ లు, బ్యాంకు ఖాతాలను సమకూరుస్తున్న మఠాలోని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి 113 సిమ్ కార్డులు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పలువురి పేర్లతో సిమ్ లు తీసుకుని చైనా, దుబాయ్, కాంబోడియాకు పంపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. దుబాయ్ సైబర్ ముఠా భారత్ లో ఏజెంట్లను నియమించుకున్నట్లు గుర్తించారు. దుబాయ్ లో ఉండే విజయ్ కీలకంగా వ్యవహరిస్తూ.. చైనా ముఠా కోసం దుబాయ్ లో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా భారత్ సిమ్ లతో దుబాయ్ నుంచి భారతీయులకు కాల్స్ చేస్తున్నారని సైబర్ సెక్యురిటీ పోలీసులు పేర్కొన్నారు.