కీలకమైన ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయి : మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్ : రాష్టానికి కీలకమైన ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఓఆర్ఆర్, శంషాబాద్ ఎయిర్ పోర్టుతో హైదరాబాద్ రూపురేఖలు మారాయని, ఈసారి రీజనల్ రింగ్ రోడ్డుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
ఆర్ఆర్ఆర్ ను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్రమంత్రి చెప్పారని ఆయన తెలిపారు. యుటిలిటీ ఛార్జెస్ భరించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టపడలేదు. దీంతో కొంతకాలం ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు యుటిలిటీ ఛార్జెస్ భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కేంద్రంతో చెప్పడంతో మళ్లీ ఆర్ఆర్ఆర్ లో కదలిక వచ్చిందన్నారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో నల్గొండ బైపాస్ రోడ్డు గురించి నాగ్ పుర్-మంచిర్యాల హైవే నిర్మాణంపై కూడా చర్చించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. విజయవాడ - హైదరాబాద్ హైవేను ఆర్ లైన్లుగా మారుస్తామన్నారు. డిసెంబర్ లూపై ఎన్ హెచ్ - 65 విస్తరణ పనులు పూర్తయ్యేలా చూస్తామని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.






