2 May, 2026 | 1:12 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

బీఆర్ఎస్‎కు షాక్ .. సుప్రీంలో ముగిసిన పార్టీ ఫిరాయింపుల కేసు

12-03-2026 02:31 PM

న్యూఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల(MLA Defection Case) కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) విచారణ ముగించింది. బీఆర్ఎస్ పిటిషన్లపై విచారణ ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఇప్పటికే పిటిషన్లను స్పీకర్ పరిష్కరించినట్లు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ(Abhishek Singhvi) కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నిర్ణయం వెలువరించారని సింఘ్వీ పేర్కొన్నారు.

పెండింగ్ లో ఉన్న ఇద్దరిపై నిన్న తుదితీర్పు ఇచ్చినట్లు సింఘ్వీ వెల్లడించారు. సుప్రీంకోర్టలో ఇంకా విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని సింఘ్వీ సూచించారు. స్పీకర్ న్యాయవాది సింఘ్వీ(Singhvi) వాదనతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. 2 రోజుల్లో స్పీకర్ తన తీర్పు కాపీలు ఫిర్యాదుదారులకు ఇవ్వాలని కోర్టు సూచించింది. జస్టిస్ కరోల్ ధర్మాసనం విచారణ ముగిసినట్లు ప్రకటించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం నాడు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.