సూరారం ఎస్సై సస్పెన్షన్

24-04-2024 01:46:24 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సూరారం పోలీసుస్టేషన్ ఎస్సై మంగళవారం సస్పెండ్ అయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. కుత్భుల్లాపూర్ నియోజకవర్గం సూరారం శివాలయం నగర్ ఓపెన్ ప్రాంతంలో ఈ నెల 14న గుర్తు తెలియని మహిళా(38) మృతదేహం లభ్యమైంది. అయితే ఎస్సై నారాయణసింగ్ ఆ కేసును అనుమానస్పద మృతిగా కాకుండా సెక్షన్ 174 కింద ఆత్మహత్యగా నమోదు చేశారు. అంతేకాకుండా ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం తో  ఉన్నతాధికారులు ఎస్‌ఐ నారాయణసింగ్‌ను సస్పెండ్ చేశారు.