కేంద్రంలో లీకేజీల ప్రభుత్వం
* పెట్రోల్ డీజిల్ ధరలకు పంపుతో సామాన్యులపై మోయలేని భారం
* యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్
* అచ్చంపేటలో భారీ నిరసన ర్యాలీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
అచ్చంపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లీకేజీ ప్రభుత్వంగా మారిందని యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ ఆరోపించారు. జాతీయస్థాయిలో ఇటీవల నిర్వహించిన అనేక ప్రవేశ పరీక్షల్లో లీకేజీలు చోటుచేసుకొని విద్యార్థుల భవిష్యత్తును అంధకారం లోకి నెట్టాయని ధ్వజమెత్తారు. నేటి ప్రవేశ పరీక్షతో సహా. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో ఎన్టీఆర్ మినిస్టర్ నుంచి ప్రధాన రహదారులు ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, ఎమ్మెల్యే వంశీకృష్ణ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివ చరణ్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జిలు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. జాతీయస్థాయి పరీక్షల నిర్వహణలో విఫలం చెందిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని లేదా ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. డీజిల్ పెట్రోల్ ధరలు పెంచు సామాన్యులపై మోయలేని భారం మోపిందని ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామాన్యులను ఇబ్బందుల గురి చేస్తూ పబ్బం గడుపుతోందని విమర్శించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాలు విసిరారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.






