16 April, 2026 | 7:49 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీ

29-03-2025 01:30 AM

మహబూబాబాద్, మార్చి 28 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రంలోని దామరవంచ గ్రామంలోని తెలంగాణ గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ బాయ్స్ వసతిగృహాన్ని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని పరిసరాలను పరిశీలించారు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పక్కాగా డైట్ మెనూ పాటించాలని, షెడ్యూల్ ప్రకారం పిల్లలకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించాలని, ప్రతి సబ్జెక్టులో అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, రాత్రి సమయాలలో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు,  ప్రస్తుత ఎండాకాలం దృశ్య కావాల్సిన సౌకర్యాలు కల్పించాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అన్నారు. వసతి గృహంలో ఏమైనా మైనర్ రిపేర్ ఉంటే వెంటనే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ వెంట కాలేజీ ప్రిన్సిపల్ హేమంత్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ విస్తరణ అధికారి సంబంధిత సిబ్బంది ఉన్నారు.