17 April, 2026 | 11:04 AM

సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు

17-04-2026 10:03 AM

బోథ్,(విజయక్రాంతి): మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సోనాల మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మండల కేంద్రం మీదుగా ప్రతిరోజు వేలాదిమంది రాకపోకలు కొనసాగిస్తున్నారు. అయితే సరిహద్దు ప్రాంతాల నుండి ఎవరు వచ్చి పోతున్నారనేది తెలియకుండా పోతున్నది. మరోవైపు దొంగతనాలను నివారించాలన్న ఉద్దేశంతో కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు అధికారుల సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఏదైనా సంఘటన జరిగితే దొంగలను పట్టుకునే ఆస్కారం ఉందని గ్రామస్తులకు వివరించారు. దీంతో సర్పంచ్ యాల బిందుజ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు.