10 April, 2026 | 3:45 AM

సర్వే 99 శాతం పూర్తి

30-11-2024 12:40 AM
  1. 19 జిల్లాల్లో ముగిసిన కులగణన
  2. శరవేగంగా డాటా ఎంట్రీ 

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ మినహా అన్ని జిల్లాల్లో 99 శాతం సర్వే పూర్తయ్యింది. 19 జిల్లాల్లో వందశాతం పూర్తవగా హైదరాబాద్‌లో 82.4శాతం ఇళ్ల నుంచి వివరాలు సేకరించారు. ఇంకా 4,41,225 నివాసాల్లో సర్వే చేయాల్సి ఉన్నది. ఇదిలా ఉండగా..

కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతున్నది. శుక్రవారం నాటికి రాష్ర్టవ్యాప్తంగా 49,79,473 నివాసాల సమాచారం ఆన్‌లైన్‌లో నమోదైంది. అత్యధికంగా ములుగు జిల్లాలో 92.0శాతం డాటా ఎంట్రీ పూర్తవగా.. యాదాద్రి భువనగిరిలో 86శాతం, సిద్దిపేటలో 80.4, మహబూబ్‌నగర్‌లో 73.9శాతం పూర్తయిన ట్టు అధికారులు తెలిపారు.