సర్వేయర్లు సర్వనాశనం
- లైసెన్స్ సర్వేయర్లను ముంచిన రేవంత్ సర్కార్
- నమ్మివస్తే ఎకరానికి రూ.10 కమీషనా?
- రోడ్డున పడ్డ 6,500 మంది : మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాయ మాటలు నమ్మి తమ ప్రైవేట్ ఉద్యోగాలు వదులుకొని వచ్చిన లైసెన్డ్స్ సర్వేయర్లను కాంగ్రెస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, వారిని నట్టేట ముంచిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆదివారం సిద్దిపేట లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లైసెన్డ్స్ సర్వేయర్ల ప్రతినిధులు హరీశ్‌రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
తమకు జరిగిన అన్యాయం వివరి స్తూ ఆయనకు వినతిపత్రం అందజేశారు. సర్వేయర్ల ఆవేదనను సావధానంగా విన్న హరీశ్ రావు, వారికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ మోసకారి తీరును ఆయన ఎండగట్టారు. భూభారతి పథకం కో సం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,500 మంది విద్యావంతులను లైసెన్స్ సర్వేయర్లుగా ఎంపిక చేసి.. తీరా ఇప్పుడు వారిని కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేయడం దారుణమని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి స్వయంగా వారికి మంచి వేతనం ఇస్తామని హామీ ఇచ్చి, శిక్షణలు ఇచ్చి, పరీక్షలు పెట్టి, ప్రమాణ స్వీకారాలు కూడా చేయించారని.. కానీ పనుల్లోకి చేరాక మాట తప్పి మోసం చేశారని అన్నా రు.
వారికి కనీస వేతనం ఇవ్వకుండా.. సర్వే చేసినందుకు ఎకరానికి కేవలం రూ.10 కమీషన్ ఇస్తామని చెప్పడం విద్యావంతులను ఘోరంగా అవమానించడమేనని మండిపడ్డారు. ఎకరం సర్వే చేస్తే పది రూపాయలా.. అంటే వీరు ఏడాది పొడవునా కష్టపడి రెం డు వేల ఎకరాలు సర్వే చేసినా వచ్చేది కేవ లం రూ.20 వేలు అని హరీశ్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు.
గత ఏడాది కాలంగా ఎలాంటి జీతం లేక, సరైన పని కల్పించక 6,500 మంది సర్వేయర్ల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ రోడ్డున పడ్డ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల పేరుతో ప్రభుత్వం వారి జీవితాలతో ఆడకుండా.. ఇచ్చిన మాట ప్రకారం వారికి తక్షణమే గౌరవ వేతనం ఇవ్వాలని, వారి ఉద్యోగాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లైసెన్డ్స్ సర్వేయర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్‌ఎస్ పార్టీ వా రికి పూర్తి అండగా ఉంటుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. వారి పక్షాన రాబోయే అసెం బ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు.




