2 March, 2026 | 5:18 AM

వారు సీఎం రేవంత్‌రెడ్డి కాలిగోటికి సరిపోరు

02-03-2026 01:45 AM

పిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్ 

హైదరాబాద్, మార్చి1(విజయక్రాంతి): కేటిఆర్, హరీశ్‌రావు ఇద్దరు కలిసినా సీఎం రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోరని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. అధికారం పోగానే గుంట నక్క కేటీఆర్ సాధు జంతువు అయ్యాడని, ఇప్పుడు ఈ గుంట నక్క ముసలి కన్నీరు కార్చుతోందని మండిపడ్డారు. కల్వకుంట్ల కేటీఆర్ అంటే అలియాస్ కల్వకుట్ర తారక రామారావని ఆయన ఆరోపించారు.

గత పదేళ్లలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను కబ్జాలు చేసింది మీరు కాదా ..? అని మెట్టు సాయి నిలదీశారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ  దేవాల య భూములు, వైకుంఠ ధామాలు అని తే డా లేకుండా కబ్జాలు చేశారని మండిపడ్డా రు. రాజకీయాలు చెయ్యండి ..కానీ, దగాకోరు పనులు చెయ్యవద్దని ఆయన సూచించారు.