30 August, 2026 | 2:04 AM

సెలెక్టర్ల నిర్ణయం షాకిచ్చింది

30-08-2026 12:06 AM

వచ్చే వరల్డ్ కప్‌కు కూడా సారథిగా ఉంటాననుకున్నా

ఎందుకు జరిగిందో అర్థం కాలేదు?

కెప్టెన్సీపై సూర్య కుమార్ వ్యాఖ్యలు 

ముంబై , ఆగస్టు 29: భారత టీ20 జట్టు కెప్టెన్సీ మార్పు తనను జట్టు నుంచి తొలగించడంపై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తొలిసారి మౌనం వీడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సారథ్యంలో భారత్ కు ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ అందించినప్పటికీ, సెలెక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్ వెల్లడించాడు.

ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల కోసం ప్రకటించిన జట్టులో తన పేరు లేదని తెలిసినప్పుడు మొదట తనకు నవ్వొచ్చిందని సూర్య చెప్పాడు. కెరీర్‌లో ఎలాంటి ఒత్తిడి పరిస్థితులు ఎదురైనా నవ్వుతూ ప్ర శాంతంగా ఉండటం తనకు అలవాటని పేర్కొన్నాడు. ప్రపంచకప్ గెలిచిన తర్వాత కూడా ఇలాంటి నిర్ణయం వస్తుందని అస్సలు ఊహించలేదని ఇది ఎలా సాధ్యం? అసలు ఎలా జరిగింది? అనే ప్రశ్నలు తనను తీవ్రంగా వేధించాయని ఒప్పుకున్నాడు. అన్నీ సవ్యంగా సాగుతున్న క్షణంలో, అకస్మాత్తుగా మార్పు ఎందుకు అని, దానికి కార ణం ఏంటో, మార్పునకు కారణం ఏంటో తెలియదన్నాడు.

2026 వరల్డ్ కప్ సాధించిన తర్వాత మరో రెండేళ్లు తానే జట్టును ముందుకు నడిపిస్తానని, ఒలింపిక్స్‌లో కూడా జట్టుకు సారథ్యం వహిస్తానని భావించినట్లు సూర్య తెలిపాడు. తన ఆలోచనలకు, సెలెక్టర్ల ఆలోచనలకు తేడా ఉంటుందని.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించడం మంచిదని వారు భావిస్తే, ఆ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని చెప్పాడు. గత కొంతకాలంగా తన బ్యాటింగ్ ఫామ్ ఆశించిన స్థాయిలో లేదని, జట్టు ప్రకటనకు రెండు రోజుల ముందే సెలెక్టర్లు తనతో మాట్లాడి ముం దుకు వెళ్లాల్సిన సమయం వచ్చిందని చెప్పినట్లు సూర్య వెల్లడించాడు. ప్రస్తుతం తిరిగి జట్టులోకి రావడం కోసం కష్టపడుతున్నానని తెలిపాడు.