30 August, 2026 | 4:39 AM

అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

30-08-2026 01:49 AM
  1. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం  
  2. మంత్రి పొంగులేటి  
  3. సమస్యలకు పరిష్కారం పట్టాల పంపిణీ                                                                    
  4. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

సూర్యాపేట, ఆగస్టు 29 (విజయక్రాంతి): భూ భారతి చట్టం ద్వారా రాష్ట్రంలోని వివా ద రహిత భూమిలన్నింటినీ సర్వే చేసి పట్టాదారు పుస్తకాలు అందజేస్తామని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అ న్నా టరు.శనివారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో నూతనకల్, మద్దిరాల మండలాలకు సంబంధించి 1921 మంది రైతులకు 2091 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,

భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌లతో కలిసి పం పిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భూ భారతి చట్టం ద్వారా వివాద రహిత భూములన్నింటికీ  పాసు పుస్తకాలు ఇస్తామని తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో మొదటి విడతన 70 గ్రామాలను ఎంపిక చేసుకొని సర్వే చేయించామన్నారు. 

పలుచోట్ల రెవెన్యూ, దేవాదాయ, అసైన్డ్ భూములు కబ్జాకు గురవుతుండడం తమ దృష్టికి వచ్చిందని, వీటిని అరికట్టేందుకు తాము కఠిన చర్యలు తీసుకుంటున్నా మన్నారు.  రానున్న సంవత్సర కాలంలో ప్రతి అంగుళాన్ని సర్వే చేస్తామని, వివాదారహిత భూములన్నింటికీ పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని మంత్రి పునరుద్ఘాటించారు.

గత ప్రభుత్వం రూ.8 లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల అప్పును తమ ప్రభుత్వంపై మోపినప్పటికీ తల తాకట్టు పెట్టైనా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు.  గడచిన రెండున్నర సంవత్సరాల్లోరాష్ట్రంలో మహిళలకు 63 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి జనం బ్రహ్మ రథం పడుతున్నారని, హైదరాబాద్‌లో కోట్ల రూపాయల విలువచేసే భూముల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మించి ఇస్తున్నామన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల రైతుల సమస్యలకు పరిష్కారం పట్టాలు ఇవ్వడమేనన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 36వేల కోట్ల రూపాయలతో  హ్యం రోడ్లను నిర్మిస్తున్నామని, తుంగతుర్తి నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలతో రోడ్లు మంజూరు చేశామని, మరో 200 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఉన్నాయని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, సీసీఎల్ ఏ సెక్రటరీ లోకేష్ కుమార్,

ల్యాండ్ సర్వీస్ సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అడిషనల్ కలెక్టర్ హరి సింగ్ ,ఆర్డీవోలు, తహసిల్దారులు, రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.