తిరుమలకు రేవంత్
22-05-2024 01:43 AM
స్వాగతం పలికిన ఆలయ ఈవో, అధికారులు
హైదరాబాద్, మే 21 (విజయక్రాం తి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం తిరుమలకు వెళ్లారు. వెంకటేశ్వరుడి సన్నిధిలో మనువడి మొక్కు తీర్చుకునేందుకు సీఎం తిరుపతికి వెళ్లగా టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు ఆలయ అధికారులు రచనా అతిథి గృహం వద్ద స్వాగతం పలికారు. శ్రీవారిని బుధవారం ఉదయం దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు. అంతకుముందు బేగంపేట ఏయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఏయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు.






