1 July, 2026 | 10:04 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై సస్పెన్స్

21-06-2025 01:54 AM
  1. ఆరోసారి ప్రయాణాన్ని వాయిదా వేసిన నాసా
  2. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడి

న్యూఢిల్లీ, జూన్ 20: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్లా అంతరిక్ష యాత్ర ఆరోసారి వాయిదా పడింది. ఈ నెల 22న శుభాంశు రోదసి యాత్ర చేపట్టాల్సి ఉండగా, యాక్సియం-4 ప్ర యోగాన్ని వాయిదా వేస్తున్నట్టు నాసా తాజాగా ప్రకటించింది. ప్రయోగానికి సంబంధించి కొత్త తేదీని త్వరలోనే వెల్లడిస్తామని వెల్లడించింది.

యాక్సి యం--4 ద్వారా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి శుభాంశు అం తరిక్ష యాత్ర చేయనున్నారు. అమెరికా కు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సి యం స్పేస్ ఈ మిషన్‌ను నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఐరోసా అంతరిక్ష సంస్థ ఈఎస్‌ఏలు ఇం దులో భాగస్వామ్యం వహిస్తున్నాయి.

ఇందులో శుభాంశు మిషన్ పైలెట్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం వివిధ కారణాల వల్ల పలుసార్లు ప్రయోగాన్ని వాయిదా వేశారు.