బాలుడి అనుమానాస్పద మృతి
పాఠశాలలో కుప్పకూలిన విద్యార్థి, చికిత్స పొందుతూ మృతి
తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
కుషాయిగూడ, మార్చి 25 (విజయక్రాంతి): పోలీస్ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడి మృతి సంచలనంగా మారింది. ఆదర్శ్ నగర్, కాప్రాకు చెందిన బ్రహ్మదండి జ్యోతి తన కుమారుడు సూరజ్ కుమార్ (14) మృతి పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం, సూరజ్ కుమార్ వాసవి శివనగర్లోని గోపీ మెమోరియల్ హై స్కూ ల్లో 9వ తరగతి చదువుతున్నాడు.
మార్చి 6 ఉదయం పాఠశాల ప్రాంగణంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో పాఠశాల యా జమాన్యం వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యు లు బాలుడిని మొదట కొరల్ ఆసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన వైద్యం కోసం మెడికోవర్ ఆసుపత్రికి మార్చారు.
అక్కడే అదే రోజు రాత్రి మెదడుకు శస్త్రచికిత్స నిర్వహించారు.తరువాతి రోజు గాంధీ ఆసుపత్రికి తరలించగా, మార్చి 8 తెల్లవారు జామున బాలుడు మృతి చెందాడు. అనంతరం కుషాయిగూడలో అంత్యక్రియలు నిర్వహించారు.వైద్యుల ప్రకారం, మెదడులో రక్తం గడ్డకట్టడం వల్లే మృతి సంభవించినట్లు తెలిపారు. అయితే, ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన తల్లి జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు మార్చ్ 25 బుధవారం రోజు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




