జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్,మార్చి 25(విజయక్రాంతి): సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్నవారికి తమ వంతు సహకారం అందించాలని ముషీరాబాద్ ఎమ్మె ల్యే ముఠా గోపాల్ సూచించారు. ఈ మేర కు బుధవారం ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ భక్తియార్ ఆధ్వర్యంలో గాంధీ దవాఖాన వద్ద రోగులకు టిఫిన్ బాక్స్ లను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవా భావాన్ని అలవ ర్చుకొని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని సూచిం చారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు.
నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయాలని సూచించారు. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త సైనికుల పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు డీ.శివ ముదిరాజ్, దీన్ దయాల్ రెడ్డి, పీ.శ్రీధర్ చారి, డివిజన్ ఉపాధ్యక్షులు జి. రాజు, బల్ల ప్రశాంత్, జావి ద్ ఖాన్, భోలక్ పూర్ డివిజన్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.




