క్వార్టర్స్‌లో స్వియాటెక్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ జోరు కొనసాగుతోంది. ప్రత్యర్థితో సంబంధం లేకుండా చెలరేగిపోతున్న డిఫెండింగ్ చాంపియన్ స్వియాటెక్.. మట్టికోట క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అమెరికా యువ సంచలనం కోకో గాఫ్, వోండ్రుసోవా, జాబుర్ కూడా క్వార్టర్స్‌కు చేరగా.. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ అల్కరాజ్, సిట్సిపాస్ అమీతుమీకి సిద్ధమయ్యారు.
పారిస్: సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్ అంచనాలకు అనుగుణంగా సాగుతోంది. స్టార్ ఆటగాళ్లు వరుస విజయాలతో ముందుకు సాగుతుండగా.. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్), కోకో గాఫ్ (అమెరికా), వోండ్రుసోవా (చెక్ రిపబ్లిక్), జాబుర్ (ట్యూనిషియా) క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో స్వియాటెక్ 6 6 పొటపోవా (రష్యా)పై పూర్తి ఏకపక్ష విజయం సాధించింది.
40 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో.. 3 ఏస్‌లు కొట్టిన స్వియాటెక్ 13 విన్నర్లతో సత్తాచాటితే.. 19 అనవసర తప్పిదాలతో పొటపోవా మూల్యం చెల్లించుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్ గాఫ్ 6 6 ఎలిసాబెట్ట (ఇటలీ)పై, ఐదో సీడ్ వోండ్రుసోవా 6 6 డానిలోవిక్ (సెర్బియా)పై, జాబుర్ 6 6 క్లారా టాసన్ (డెన్మార్క్)పై విజయాలు సాధించారు. క్వార్టర్స్‌లో వోండ్రుసోవాతో స్వియాటెక్, జాబుర్‌తో గాఫ్ తలపడనున్నారు.
జొకో కష్టకష్టంగా..
పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో అల్కరాజ్ (స్పెయిన్) 6 6 6 ఫెలిక్స్ ఆగర్ (కెనడా)పై గెలుపొందాడు. 2 గంటల 20 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని అల్కరాజ్ వరుస సెట్లలో విజయం సాధించాడు. మరో ప్రిక్వార్టర్స్ పోరులో సిట్సిపాస్ (గ్రీస్) 3 7 (7/4), 6 6 ఆర్నాల్డీపై గెలిచాడు. క్వార్టర్స్‌లో సిట్సిపాస్‌తో అల్కరాజ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మరోవైపు మూడో రౌండ్‌లో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ పోరాడి నెగ్గాడు. హోరాహోరీగా సాగిన పోరులో జొకోవిచ్ (సెర్బియా) 7 6 (6/8), 2 6 6 లొరెన్జో ముసెట్టి (ఇటలీ)పై గెలిచాడు.
నాలుగున్నర గంటల పాటు సాగిన పోరులో జొకో 5 ఏస్‌లు, 44 విన్నర్లు, 9 బ్రేక్ పాయింట్లు సాధించాడు. తొలి మూడు సెట్లలో రెండింట ఓడిన జొకో ఒక దశలో కోలుకోవడం కష్టమే అనిపించినా.. తనకే అలవాటైన చాంపియన్ ఆటతీరుతో తిరిగి పుంజుకున్న ప్రపంచ నంబర్‌వన్ చివరి రెండుసెట్లలో ప్రత్యర్థికి కనీస అవకాశం ఇవ్వకుండా విజృంభించి విజయం సాధించాడు. పురుషుల డబుల్స్‌లో భారత సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న ఎబ్డెన్ జోడీ 7 4 6 బ్రెజిల్ జంటపై విజయం సాధించింది. అయితే మూడో రౌండ్‌లో బోపన్న ద్వయం.. భారత్‌కే చెందిన బాలాజీ జోడీ తలపడనుంది.






