24 August, 2026 | 11:28 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

శభాష్ ప్రజ్ఞానంద

03-06-2024 01:49 AM

ప్రపంచ రెండో ర్యాంకర్‌పై ఘనవిజయం

టాప్ ప్రవేశం

స్టావెంజర్: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి సత్తాచాటాడు. ఇటీవల ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను చిత్తుచేసిన ఈ చెన్నై చిన్నోడు. ఇప్పుడు ప్రపంచ రెండో ర్యాంకర్ ఫాబియాన్ కరునా (అమెరికా)పై గెలిచి అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ అడుగుపెట్టాడు. నార్వే చెస్ టోర్నీ ఐదో రౌండ్‌లో తెల్ల పావులతో బరిలోకి దిగిన ప్రజ్ఞానంద.. 40 ఎత్తుల్లో కరున ఆట కట్టించాడు. ఐదు రౌండ్లు ముగిసేసరికి 8.5 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ప్రజ్ఞానంద.. మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. హికారు నకుమురా (అమెరికా) 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. కార్ల్‌సన్ (నార్వే) 9 పాయింట్లతో రెండో ప్లేస్‌కు పరిమితమయ్యాడు. మరో ఐదు రౌండ్లు మిగిలి ఉన్న ఈ క్లాసికల్ ఈవెంట్‌లో విజేతగా నిలవడమే తన లక్ష్యమని ప్రజ్ఞానంద వెల్లడిం చాడు. మహిళల విభాగంలో ప్రజ్ఞానంద సోదరి, గ్రాండ్‌మాస్టర్ వైశాలీ.. టింగ్‌కీ లీ (చైనా) పై గెలవగా.. మెన్‌జున్ జు (చైనా) చేతిలో కోనేరు హంపీ పరాజయం పాలైంది.