12-02-2026 01:00:36 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రంలో 41 రోజుల హనుమాన్ దీక్షను భక్తిశ్రద్ధలతో పూర్తి చేసిన అనంతరం, సిద్ధ రామేశ్వర టెంపుల్ నుంచి హనుమాన్ స్వాములు కొండగట్టు యాత్రకు బయలుదేరారు. దీక్షకాలంలో నియమ నిష్ఠలతో ఆచరణ చేపట్టి, శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వాములు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రలో గురుస్వామి నాగభూషణం నేతృత్వంలో గజ్జె వేణు, గంగారాం, శంకర్ తదితర హనుమాన్ స్వాములు పాల్గొని భక్తి వాతావరణాన్ని నెలకొల్పారు. గ్రామ వీధుల గుండా సాగిన యాత్ర సందర్భంగా భజనలు, జయ హనుమాన్ నినాదాలతో పరిసరాలు మార్మోగాయి. కొండగట్టు హనుమాన్ స్వామి ఆశీస్సులతో గ్రామానికి శాంతి, సమృద్ధి కలగాలని భక్తులు ఆకాంక్షించారు.