పుల్లూరు బండపై స్వాతి నక్షత్ర ఉత్సవం
సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు బండ శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం(Sri Swayambhu Lakshmi Narasimha Swamy Temple)లో శనివారం స్వాతి నక్షత్ర ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రహ్లాదుని ప్రార్థన మేరకు శ్రీమన్నారాయణుడు నరసింహ స్వామి రూపంలో స్వాతి నక్షత్రం రోజున ఆవిర్భవించాడు.
ప్రతినెలలో వచ్చే స్వాతి నక్షత్రం రోజున జన్మనక్షత్ర ఉత్సవం పుల్లూరు బండ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో స్వాతి నక్షత్ర ఉత్సవం ఘనంగా జరుగుతుందని, అందులో భాగంగా శనివారం రోజున పుల్లూరు బండ క్షేత్రంలో స్వాతి నక్షత్ర ఉత్సవం దేవాలయ వంశపారంపర్య అర్చకులు కలకుంట్ల రంగాచార్య, పొడిచేటి శ్రీనివాసా చార్య, పొడిచేటి రామకృష్ణ, కలకుంట్ల వెంకట్, కలకుంట్ల నచికేత, సంపన్ ముడుంబై రుత్విక్, సాయి కృష్ణల ఆధ్వర్యంలో ఉత్సవం ఘనంగా, సంప్రదాయ బద్ధంగా జరిగింది. కార్యక్రమం లో భాగంగా ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం స్వయాభూ లక్ష్మీ నరసింహ స్వామి కి నవకళశ అభిషేకం నిర్వహించారు. ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






