30 March, 2026 | 2:17 AM

మధుర వసంతం

30-03-2026 12:00 AM

సంవత్సరంలో ఆహ్లాదకరాల రాజు ఈ వసంతం

ఈ కాలంలో- ప్రతివస్తువూ వికసిస్తుంటుంది

ఈ కాలంలి- ముగ్ధకన్యకలు వలయనృత్యం

చేస్తుంటారు, చలి కరవదు, ముచ్చట గొలిపే పక్షులు

ముద్దుముద్దుగా పాడుతుంటాయి:

కోకిలా, బుల్‌బుల్, కొక్కిరాయీ, ఉలూకమూ

తమ గానాలతో వసంతాన్ని ఆహ్వానిస్తుంటాయి!

తాళవృక్షమూ వైశాఖమూ పల్లెటూళ్ల ఇళ్లను

పండగల్‌తో సంతోషభరితంగా ఉంచుతుంటాయి

గొర్రెపిల్లలు గంతులువేస్తూ ఆటలాడుతుంటాయి

గొర్లకాపరులు దినమంతా పిల్లనగ్రోవులను

ఊదుతూనే ఉంటారు

అవును, పక్షుల పాటల వరుసలలో

ఈ వసంతానందాల ఉనికిని మనం వింటుంటాం

కోకిలా, బుల్‌బుల్, కొక్కిరాయీ, ఉలూకమూ

తమ గానాలతో వసంతాన్ని ఆహ్వానిస్తుంటాయి!


పొలాలు తీయగా శ్వాసిస్తుంటాయి

తెల్లని గడ్డిచామంతిపూలు మన పాదాలను

ముద్దాడుతూ ఉంటాయి

తరుణ ప్రేమికులు తరచూ కలుసుకుంటుంటారు

పాతతరం భార్యలు వెచ్చదనం కోసం

ఉదయం సూర్యకాంతిలో కూర్చుంటుంటారు

ప్రతి వాడలోనూ ఇవే వరసల ప్రియపలకరింపులూ

మన చెవులతో వింటుంటాం

కోకిలా, బుల్‌బుల్, కొక్కిరాయీ, ఉలూకమూ

తమ గానాలతో వసంతాన్ని ఆహ్వానిస్తుంటాయి !!