24 March, 2026 | 11:27 PM

కోరమాండల్ కాకినాడ ప్లాంట్ కు స్వోర్డ్ ఆఫ్ హానర్ 2025

24-03-2026 09:51 PM

కాకినాడ ఃభారతదేశంలోని ప్రముఖ వ్యవసాయ ఎరువుల సంస్థలలో ఒకటైన కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (సిఐఎల్) పనిప్రదేశాలలో  భద్రత పరంగా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పుతూనే ఉంది. ఈ క్రమంలో కాకినాడ ప్లాంట్‌కు బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ యొక్క స్వోర్డ్ ఆఫ్ హానర్  2025 అవార్డు లభించింది. ఆరోగ్యం, భద్రత, సంక్షేమంలో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పిన సంస్థలకు లభించే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపులలో ఇది ఒకటి. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం,  లండన్‌లోని చారిత్రాత్మక డ్రేపర్స్ హాల్‌లో జరిగింది.  ప్రపంచవ్యాప్తంగా వృత్తిపరమైన భద్రత మరియు ఉద్యోగుల శ్రేయస్సు పరంగా అత్యున్నత ప్రమాణాలను ప్రదర్శించే ప్రముఖ సంస్థలకు ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది. కోరమాండల్ తరపున కాకినాడ యూనిట్ సీనియర్ ఏవిపి, మాన్యుఫాక్చరింగ్ హెడ్ కె. జగన్నాథన్, వైజాగ్ ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ , మాన్యుఫాక్చరింగ్ హెడ్ సిహెచ్. శ్రీనివాసరావు, కాకినాడ యూనిట్ ఈహెచ్ఎస్ డిజిఎం పి . గణేష్ ఈ అవార్డును అందుకున్నారు. 

కాకినాడ యూనిట్ బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ యొక్క కఠినమైన ఫైవ్-స్టార్ ఆడిట్ కార్యక్రమాన్ని చేపట్టింది. 2024లో రెండుసార్లు , 2025లో మరోసారి ఫైవ్-స్టార్ సర్టిఫికేషన్‌ను సాధించడం ద్వారా ప్రతిష్టాత్మకమైన స్వోర్డ్ ఆఫ్ హానర్ కు అర్హత సాధించింది. దేశంలోని అతిపెద్ద ఫాస్ఫాటిక్ ఎరువుల కేంద్రాలలో కోరమాండల్ యొక్క కాకినాడ ప్లాంట్ ఒకటి. సంక్లిష్టమైన రసాయన శాస్త్రాలను ఇది నిర్వహిస్తుంది. ఈ ప్రదేశం పక్షుల అభయారణ్యం కలిగి ఉంది, ఇది 100 కంటే ఎక్కువ జాతుల వలస పక్షులకు ఆశ్రయం కల్పిస్తుంది. ఈ అవార్డు రావడంపై కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్  అమీర్ అల్వి తమ సంతోషాన్ని పంచుకున్నారు. సురక్షితమైన , భద్రతతో కూడిన కార్యాలయాన్ని పెంపొందించడంలో తమ నిబద్ధతను ఈ అవార్డు నిదర్శనంగా నిలిచిందన్నారు. భద్రతాపరంగా ఎప్పుడూ రాజీపడబోమని, పర్యావరణ అనుకూల పని ప్రదేశాలను ఎంచుకుని ముందుకు వెళుతున్నట్టు తెలిపారు.