3 June, 2026 | 6:49 PM

విద్యార్థులకు తైక్వాండో కలర్ బెల్ట్ ల ప్రధానోత్సవం

03-06-2026 06:18 PM

ముకరంపుర,(విజయక్రాంతి): ఓవెల్స్ స్కూల్ లో జరిగిన తైక్వాండో కలర్ బెల్ట్ ప్రధానోత్సవం లో  20 మంది బాలికలు 23 మంది బాలురు పాల్గొని వారి యొక్క ప్రతిభను కనపరచి బెల్టులను కైవసం చేసుకున్నారు. ఆత్మ రక్షణ విద్య ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి చాలా అవసరమని అలాగే తైక్వాండో అనేటువంటిది రిజర్వేషన్ కలిగినటువంటి గేమ్ అని ఓవెల్స్ స్కూల్ ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డి తెలియపరిచారు.

ముఖ్య అతిథులుగా పరీక్ష ఎగ్జామినర్ గా తెలంగాణ స్టేట్ తైక్వాండో అసోసియేషన్ ట్రెజరర్ జి.సంతోష్, కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రెటరీ ఎస్.సంతోష్ పాల్గొన్నారు. అలాగే బ్లాక్ బెల్ట్ పరీక్షలో అర్హత పొందినటువంటి పెద్ది పార్థు, ననుమాల విహన్ రావ్, దాసరి శ్రీకృతి, ఎన్నం మాన్విలకు కొరియన్ నుండి వచ్చినటువంటి తైక్వాండో బ్లాక్ బెల్ట్ సర్టిఫికేట్ లను కూడా ఇవ్వడం జరిగింది అని సూర్య తైక్వాండో కోచ్ పెండ్లి రాజేందర్ తెలియచేశారు.