25 May, 2026 | 1:04 AM

విద్యార్థులకు తైక్వాండో పోటీలు

25-05-2026 12:00 AM

ముషీరాబాద్, మే 24 (విజయక్రాంతి): బాగ్‌లింగంపల్లిలోని సూపర్ పవర్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎస్వీకే వెనుక భాగంలో ఉన్న నెబర్‌హుడ్ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి తెలం గాణ తైక్వాండో అసోసియేషన్ (టీఎన్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు మట్టా నాగేందర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందిం చారు.

ప్రధాన పరీక్షాధికారిగా అంతర్జాతీయ క్రీడాకారుడు, 6వ డాన్ బ్లాక్ బెల్ట్ మొయిన్ వ్యవహరించారు. సూపర్ పవర్ తైక్వాండో అకాడమీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, 3వ డాన్ బ్లాక్ బెల్ట్ పీ సుబ్రహ్మణ్యం మాట్లాడు తూ తైక్వాండో ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయని తెలిపా రు. అలాగే శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం మెరుగుపడటానికి మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో 2వ డాన్ బ్లాక్ బెల్ట్ కోచ్ జీవీ కార్తీక్‌తోపాటు కోచ్‌లు నిలయ, సంజనా, మోక్షిత, రుద్రాక్ష్, రవి కిరణ్, ఓ కార్తికేయ, మట్టా హర్షిత్ పాల్గొని విద్యార్థులకు మార్గద ర్శనం చేశారు. కార్యక్రమ నిర్వహణలో వేణు కీలక పాత్ర పోషించారు. తైక్వాండో శిక్షణ వల్ల విద్యార్థులు శారీరకంగా దృఢంగా మారడమే కాకుండా జీవనశైలిని అలవ ర్చుకుంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం చివరలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు.