వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన తాసీల్దార్
30-04-2026 01:15 AM
నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): మండలంలోని ఐకెపి ఆధ్వర్యంలో గల వదలపర్తి, గోపాల్పేట్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల తాసిల్దార్ బిక్షపతి సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా తాసిల్దార్ బిక్షపతి మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటా మని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలులో వరి ధాన్యం కాంట ఆలస్యం, లారీల కొరత, హమాలి కొరత ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయని రైతులను అడిగి తెలుసుకున్నారు.ఎండలు ఎక్కువగా ఉన్నందున రైతులు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలను వివరిస్తూ వాటిని పాటించాలని తెలిపారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహేష్ చంద్ర,సీసీలు రమేష్,నారాయణ,వివోఏ బాలకిషన్ రైతులు పాల్గొన్నారు.






