30 April, 2026 | 2:46 AM

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సత్తా

30-04-2026 01:14 AM

బిచ్కుంద, ఏప్రిల్ 29 (విజయక్రాంతి); పదవ తరగతి ఫలితాల్లో  బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థి ప్రతిభ చాటి 600 మార్కులకు గాను 570 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావడంపై సదరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు ప్రజల నుంచి హర్షద్వానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యాభ్యాసం లో ముందంజలో ఉండే విధంగా ప్రణాళిక బద్ధంగా సదరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం కష్టపడిన ప్రతిఫలాన్ని తమ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థి మొహమ్మద్ మౌలానా అనే విద్యార్థి ఏకంగా ఉన్నత స్థాయిలో570/600 మార్కులు సాధించి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు గొప్ప పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు తీసుకు రావడం తమకేంతో గర్వకారణమని ప్రధానోపాధ్యాయులు దత్త గౌడ్ అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే వారిపై చులకన భావం వ్యక్తం చేసే వారికి ఇది చెంపపెట్టు అని  ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం పలువురు ప్రజలు సైతం తమ అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఇకనైనా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు విద్యాభ్యాసం చేయించడానికి వెనుకాడకుండా ముందుకు రావాలని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు డేటుగా విద్యాభ్యాసం కొనసాగిస్తూ ప్రతిభ పాటవాలకు ప్రాధాన్యతనిస్తున్నామని ఈ విషయంలో ప్రతి ఒక్కరు ఆలోచించాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం విజ్ఞప్తి చేశారు.