28 June, 2026 | 2:03 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

తాజ్‌మహల్‌కూ వరద దెబ్బ

15-09-2024 12:21 AM
  1. ప్రధాన డోమ్ వద్ద నీటి లీకేజీ 
  2. ఆవరణలోని తోటనూ ముంచెత్తిన వరద

ఆగ్రా, సెప్టెంబర్ 14: ప్రపంచ ఏడు వింతల్లో ఒకటిగా పేరొందిన తాజ్‌మహల్‌నూ వరద ప్రభావం వీడలేదు. యూపీలో ని ఆగ్రాలోని ఈ కట్టడం ప్రధాన డోమ్ వద్ద నీరు లీకవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ౩ రోజులుగా ఆగ్రాలో భారీగా వర్షా లు పడుతుండడమే ఇందుకు కారణం. నీటి లీకేజీ వల్ల ఎలాంటి నష్టం లేదని అధికారులు స్పష్టంచేశారు. తాజ్‌మహల్ ఆవరణ లోని తోటను సైతం వరద ముంచెత్తింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఆగ్రాలో కురుస్తున్న వర్షాలతో తాజ్‌మహల్ ప్రధాన డోమ్ వద్ద నీరు లీకవుతుంది.

ఈ లీకేజీ వల్ల కట్టడానికి ఎలాంటి నష్టం లేదు’ అని పురావస్తు శాఖ పేర్కొంది. ఇదే విషయాన్ని ఆగ్రా సర్కిల్ చీఫ్ సూపరింటెండెంట్ రాజ్‌కుమార్ స్పష్టంచేశారు. 2017 మధ్యకాలంలో అత్యధిక మంది విదేశీయులు పర్యటించిన ప్రాంతంగా ఆగ్రా నిలిచినట్లు యూపీ పర్యాటకశాఖ అధికారిక డాటాలో పేర్కొంది. ఈ కాలంలో 1.51 కోట్ల మంది యూపీని సందర్శించగా అందులో 80.08 లక్షల మంది ఆగ్రా, 28 లక్షల మంది వారణాసిలో పర్యటించారు. కొవిడ్ టైమ్‌లో విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గినా తిరిగి పుంజుకుంది.